ఇల్లంతకుంట–గాలిపల్లి హాస్టల్లో దుప్పట్లు పంపిణీ.
మన ప్రజాప్రతినిధి – మానకొండూర్, నవంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి బీసీ హాస్టల్, అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టళ్లలో తీవ్రమైన చలితో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ సూచనలపై “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం ద్వారా దుప్పట్లు పంపిణీ చేశారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా పాల్గొని దుప్పట్లను విద్యార్థులకు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నెలలుగా దుప్పట్లు,...