మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,నవంబర్,17:
ప్రజావాణికి వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి ఇంచార్జి కలెక్టర్ సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 149 దరఖాస్తులు వచ్చాయిరెవెన్యూ 43, హౌసింగ్ శాఖకు 35, డీఆర్డీఏకు 12, ఎస్డీసీకి 11, విద్య శాఖ, సంక్షేమ అధికారికి 7చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా వైద్యాధికారి, ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి, నీటి పారుదల శాఖకు నాలుగు చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారి కి 3, లీడ్ బ్యాంక్ మేనేజర్, సెస్ కార్యాలయానికి రెండు చొప్పున, డీసీఎస్ఓ, మైనింగ్ శాఖ, మైనార్టీ సంక్షేమ అధికారి, ఈఈ పీఆర్, ఆర్ టీ సీ సిరిసిల్ల, ఎంపీడీఓ కోనరావుపేట, ఎస్పీ కార్యాలయానికి ఒకటి చొప్పున వచ్చాయి.అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. నూతన వైద్యశాలలు, అంగన్వాడిలు, పాఠశాలల భవనాలకు మిషన్ భగీరథ నీటి, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, ఆధార్ కార్డ్ తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న విద్యాలయాల విద్యార్థులకు త్వరితగతిన బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.