అర్జీలు సకాలంలో పరిష్కరించాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,నవంబర్,17:ప్రజావాణికి వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి ఇంచార్జి కలెక్టర్ సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 149 దరఖాస్తులు వచ్చాయిరెవెన్యూ 43, హౌసింగ్ శాఖకు 35, డీఆర్డీఏకు 12, ఎస్డీసీకి 11, విద్య శాఖ, సంక్షేమ అధికారికి 7చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా వైద్యాధికారి, ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి, నీటి పారుదల శాఖకు నాలుగు చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారి కి...