పూలే జ్యోతి చిరస్థాయి — ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నివాళులు
మన ప్రజాప్రతినిధి — అక్బర్ పేట మండలందుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా.మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా భూంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య మహనీయుల విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ—సమాజంలో అంటరానితనం, కులవివక్ష, సామాజిక అన్యాయం నిర్మూలనకై మహాత్మ పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాలు, ముఖ్యంగా దళిత–బహుజనుల విద్యాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా సంస్కర్తగా పూలే దంపతులు చరిత్రలోనిలిచిపోయారనిగుర్తుచేశారు.మహిళలకు...