ధర్మేంద్ర మరణంపై ప్రధాని మోదీ సంతాపం
భారత సినిమా రంగంలో ఓ యుగానికి తెరపడిందని ప్రధాని వ్యాఖ్యవిభిన్న పాత్రలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న నటుడు ధర్మేంద్రకుటుంబ సభ్యులు, అభిమానులకు మోదీ ప్రగాఢ సానుభూతిన్యూఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): భారత సినీ రంగం దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణంపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ధర్మేంద్ర వెళ్లిపోవడం భారత సినిమా చరిత్రలో ఒక యుగానికి ముగింపు అని ప్రధాని పేర్కొన్నారు. విభిన్న తరహా పాత్రలను సహజంగా పోషించి కోట్లాది మంది అభిమానులను సంపాదించిన విభిన్న ప్రతిభాశాలి ధర్మేంద్రను మోదీ గుర్తుచేశారు....