సిద్దిపేట నియోజకవర్గం. నవంబర్ 30.(మనప్రజాప్రతినిధి )
సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల అభ్యర్థులకు తెలియజేయవలసినది
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు సందర్భంగా,
సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కింది నియమావళిని పాటించవలసింది.
ముందస్తు అనుమతులు లేకుండా
▪నామినేషన్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదు.
▪డప్పులు, డీజేలు, మైక్‌లు, సౌండ్ సిస్టమ్‌లు వాడటం పూర్తిగా నిషేధితం.
▪పెద్ద సంఖ్యలో అనుచరులను సమీకరించి నామినేషన్‌కు రావడం అనుమతించబడదు.
ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించగలరు ఈ నియమాలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే మా లక్ష్యం. అందరి సహకారం కోరడమైనది.
ఇట్లు
సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ..