manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 November 2025, 7:09 am Editor : Mana Praja Prathinidhi

ఉపన్యాస–వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

మన ప్రజా ప్రతినిధి — కొండపాక మండలం.నవంబర్ 26.

విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని సాయి కృప స్కూల్ ప్రిన్సిపల్ వనజ
దుద్దెడ సాయి కృప హైస్కూల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి ఉపన్యాస–వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ విద్యార్థులు పోటీల్లో పాల్గొనడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛ, విషయ పరిజ్ఞానం, సంగ్రహణ శక్తి పెరుగుతుందని తెలిపారు.
ఉపన్యాసాలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికిదోహదపడతాయనిపేర్కొంది.పాల్గొన్నవిద్యార్థినీ–విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.ఈ ఏడాది పోటీలను “సెల్ ఫోన్ వినియోగం: లాభాలు–నష్టాలు”అనే అంశంపై నిర్వహించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా దుబ్బాక సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రవీందర్, సీనియర్ జర్నలిస్టు వడ్లకొండ శ్రీనివాస్, అడ్వకేట్ పెద్దంకుల శ్రీకాంత్ వ్యవహరించారు.
ఉపన్యాస పోటీ ఫలితాలు
ప్రథమ బహుమతి (సంయుక్తంగా):
కమల లాలిత్య — గజ్వేల్ సాయి జిడిఆర్ హైస్కూల్
మనిషా — దుద్దెడ సాయి కృప విద్యాలయం
తృతీయ బహుమతి:
యాస్మిన్ — వికాస్ హైస్కూల్, సిద్దిపేట
కన్సోలేషన్ బహుమతులు:
మనితేజ్ — సెయింట్ ఆన్స్ హైస్కూల్, కుకునూరుపల్లి
భావన శ్రీ — సాయి కృప విద్యాలయం, దుద్దెడ
వ్యాసరచన పోటీ ఫలితాలు
మొదటి బహుమతి:
కె. ఆధ్యా — గాయత్రి విద్యాలయం, సిద్దిపేట
రెండో బహుమతి:
జి.సాయశ్రీ — గాయత్రి విద్యాలయం, సిద్దిపేట
తృతీయ బహుమతి:
నక్షత్ర — వికాస్ హైస్కూల్, సిద్దిపేట
కన్సోలేషన్ బహుమతులు:
వై. ప్రవస్థి — సెయింట్ మేరీ విద్యానికేతన్, ప్రజ్ఞాపూర్
లక్షిత — సెయింట్ ఆన్స్ హైస్కూల్, కుకునూరుపల్లి.కార్యక్రమంలో సాయి కృప విద్యాలయం పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఈ. కాంతారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పంజ రమేష్ పాల్గొన్నారు.