సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి రజినీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం

హైదరాబాద్, నవంబర్ 17 ( మనప్రజాప్రతినిధి): ప్రముఖ స్టార్‌ నటులు రజినీకాంత్ , బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిద్దరినీ ఘనంగా సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో వీరిని సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌  తెలిపారు.గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో జరిగిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని...