R&B రోడ్డు సమస్యలపై వినతి పత్రం అందజేత..

సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ – నవంబర్ 24, 2025. సిద్దిపేట  రూరల్ మండలంలోని రావురూకుల గ్రామం ప్రధాన రహదారి తీవ్ర దుస్థితి కారణంగా గ్రామ ప్రజలు నిత్యజీవితంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు కట్ట పక్కగా వెళ్లే ఈ రహదారి వర్షాకాలంలో పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారడంతో విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవలకు భారీ అంతరాయం ఏర్పడుతోంది.ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్దిపేట కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్ గ్రామ ప్రజల తరఫున వినతిపత్రాన్ని సిద్ధం చేసి సమర్పించారు.ప్రజవాణి కార్యక్రమం సందర్భంగా...