మన ప్రజా ప్రతినిధి // అక్బర్‌పేట్–భూంపల్లి. నవంబర్ 27
అక్బర్‌పేట్–భూంపల్లి మండలంలోని రుద్రారం గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి రెడ్డిపల్లి స్వరూప యాదవరెడ్డి తెలిపారు. ప్రజా సేవ కోసం, గ్రామ అభివృద్ధి కోసం అవకాశం ఇవ్వాలని రుద్రారం ప్రజలకు విజ్ఞప్తిచేశారు.గురువారంఈసందర్భంగామాట్లాడినఆయనదుబ్బాకనియోజకవర్గనాయకులఅండదండలతో,మండలనాయకులు,కార్యకర్తలమద్దతుతోగ్రామంలోని ప్రతి పనిని పూర్తి చేసి చూపించే పట్టుదల తనదేనని తెలిపారు. గ్రామంలో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ప్రజల పక్షాన నిలబడి ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు.రాజకీయాల్లోకి రావడం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనేనని స్పష్టం చేసిన స్వరూప యాదవరెడ్డి—గ్రామ ప్రజలతో కలిసి ఉండి, వారి సమస్యల కోసం పోరాటం చేస్తానని చెప్పారు.”గ్రామ అభివృద్ధి ప్రజా సేవకుడితోనే సాధ్యం. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని సర్పంచ్ అభ్యర్థి రెడ్డిపల్లి స్వరూప యాదవరెడ్డి అన్నారు.