manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 6:48 am Editor : Mana Praja Prathinidhi

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నుండి లంచం తీసుకున్న రేగళ్ళపాడు సెక్రటరీ సస్పెండ్

సత్తుపల్లి,మనప్రజాప్రతినిధి న్యూస్,నవంబర్ 20:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎలాంటి అవినీతికి తావు లేకుండా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం కొంతమంది అధికారుల వల్ల అభాసుపాలు కావడానికి ఎట్టి పరిస్థితుల్లో సహించదు అనడానికి నిదర్శనం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నుండి లంచం తీసుకున్న రేగళ్ళపాడు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ .ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామపంచాయతీ లోని లబ్ధిదారులు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి  రేగళ్లపాడు గ్రామపంచాయతీ సెక్రటరీ శివ మాధవరావు పై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ వద్ద డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన హౌసింగ్ ఎండి వీపీ గౌతమ్ విచారణ అధికారిగా పీడీ శ్రీనివాస్ ను నియమించి పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందిన వెంటనే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హౌసింగ్ ఎండి ఆదేశాలు అందిన వెంటనే ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ బుధవారం సాయంత్రం రేగళ్లపాడు గ్రామపంచాయతీ సెక్రటరీ శివ మాధవరావును సస్పెండ్ చేయడం జరిగింది.