షూటింగ్‌లో గాయపడిన శ్రద్ధా..
ముంబై, నవంబర్ 24, మనప్రజాప్రతినిధి:బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సినిమా షూటింగ్ సమయంలో గాయపడడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈతా’ జీవితకథా చిత్రీకరణ నాసిక్‌లో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాట చిత్రీకరిస్తుండగా నౌవారీ చీరతో పాటు భారీ ఆభరణాలు ధరించి వేగంగా నృత్యం చేస్తుండగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయింది. దాంతో ఆమె ఎడమ కాలికి గాయమై స్వల్ప ఫ్రాక్చర్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు.ఈ విషయంపై శ్రద్ధా స్వయంగా స్పందిస్తూ… “పెద్దగా భయపడాల్సిన విషయం ఏమీ...