manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 9:09 am Editor : Mana Praja Prathinidhi

సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్టులో 70 మంది విద్యార్థులు పాల్గొని   కలర్ బెల్టులు గెలుపొందారు..

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట,నవంబర్ 16:

ఈరోజు అనగా తేదీ 16 నవంబర్ 2025 సిద్దిపేట పట్టణంలోని ఐ.ఎం.ఏ హాల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్టులో 70 మంది విద్యార్థులు పాల్గొని   కలర్ బెల్టులు గెలుపొందడం జరిగింది,  గెలుపొందిన తైక్వాండో విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన  సిద్దిపేట జిల్లా తైక్వాండో గౌరవ అధ్యక్షులు శ్రీ వేలేటి రాధాకృష్ణ శర్మ గారు బెల్టులు మరియు మెడల్స్ మరియు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రాధాకృష్ణశర్మ గారు మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం వలన ఆత్మ రక్షణ మరియు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ మరియు మంచి ఆరోగ్యం మరియు మేధాశక్తి పెరుగుతుందని  సిద్దిపేట తైక్వాండో విద్యార్థులు రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయిలో పథకాలు సాధించి సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని కోరారు తైక్వాండో క్రీడకు 2% స్పోర్ట్స్ కూడా వర్తిస్తుందని అన్నారు ఈ బెల్ట్ ప్రమోషన్   టెస్ట్ కు ఎగ్జామినర్ గా  డి. ధనుష్ గౌడ్ హైదరాబాద్ గారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ విద్యార్థులు శివరాజ్ మరియు పి. గుణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు  అని సిద్దిపేట జిల్లా తైక్వాండో కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్ తెలిపారు.ఇట్లు విధేయుడు రాచకొండ శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా తైక్వాండో కార్యదర్శి.