ఆందోల్(మనప్రజాప్రతినిధి,నవంబర్21:)
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు అయినా, బాగా రెడ్డి సింగూరు ప్రాజెక్టు, ప్రస్తుతం ప్రమాద స్థితిలో ఉందని, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డి ఎస్ ఏ) స్పష్టం చేసింది, ప్రాజెక్టు డ్యాం భద్రతపై, ఆందోళన వ్యక్తం చేసిన ఆ సంస్థ సదరన్ రీజన్ డైరెక్టర్, నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజనీర్, (ఈ ఎన్ సి )కు అత్యవసర లేఖ రాశారు, ఎటువంటి జాప్యం లేకుండా, మరమత్తు పనులు ప్రారంభించేలా ఆదేశించారు, ఇటీవల నెలలో నీటిమట్టం పెరగడంతో, సింగూరులో నీటి నిలువలు,117, టీఎంసీలకు చేరి, రికార్డు స్థాయికి చేరాయి, ఆ భారీ నింపుబడి సమయంలో, డ్యాం మట్టికట్ట, రివిట్మెంట్, పార్ పేట్, గోడలు పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నట్టు, నివేదికలు సూచిస్తున్నాయి, మట్టి కట్ట పైన కూడా చీలికలు, గీతలు ఉన్నాయని అధికారులు, గుర్తించారు, డ్యాం దిగువన ఉన్న మంజీరా, నిజాంసాగర్,,ప్రాజెక్టుల భద్రతను, పరిగణలోకి తీసుకుంటే, సింగూర్ డ్యాం పనులు అత్యంత కీలకమని, (ఎన్డీఎస్ఏ )సూచించింది, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, తక్షణ చర్యలు తీసుకోవాలని, అధికారులను ఆదేశించింది, సాంకేతికంగా సింగూరు ప్రాజెక్టు, డిజైన్ ప్రకారం, రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం, ప్రాజెక్టు అధికారులు తెలిపారు,( ఎఫ్ ఆర్ ఎల్ ) 523.600, మీటర్లకే పరిమితమై ఉండాలి, అయితే 2017, అక్టోబర్ 30 న, జారీ చేసిన జీవో నెంబర్ 685, ప్రకారం, మిషన్ భగీరథ అవసరాల కోసం, కనీస నీటిమట్టాన్ని 520.50, మీటర్లకు నిర్ణయించారు, తదుపరి సంవత్సరాల్లో మాత్రం, ఈ పరిమితిని మించి,522, మీటర్ల వరకు నీటిమట్టం కొనసాగించారని, లేక లో ప్రస్తావన ఉంది, ప్రస్తుతం డ్యాం పరిస్థితి, సవాల్ సృష్టిస్తోందని, మట్టి కట్ట బలోపేతం, రివిట్మెంట్ పునర్నిర్మాణం, చేపట్టకపోతే, విపరీత పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని, నిపుణులు హెచ్చరిస్తున్నారు….