సింగూర్ డ్యాం కు తక్షణ మరమ్మతులు అవసరం ప్రాజెక్టు భద్రతపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

ఆందోల్(మనప్రజాప్రతినిధి,నవంబర్21:) ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు అయినా, బాగా రెడ్డి సింగూరు ప్రాజెక్టు, ప్రస్తుతం ప్రమాద స్థితిలో ఉందని, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డి ఎస్ ఏ) స్పష్టం చేసింది, ప్రాజెక్టు డ్యాం భద్రతపై, ఆందోళన వ్యక్తం చేసిన ఆ సంస్థ సదరన్ రీజన్ డైరెక్టర్, నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజనీర్, (ఈ ఎన్ సి )కు అత్యవసర లేఖ రాశారు, ఎటువంటి జాప్యం లేకుండా, మరమత్తు పనులు ప్రారంభించేలా ఆదేశించారు, ఇటీవల నెలలో నీటిమట్టం పెరగడంతో, సింగూరులో నీటి...