manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 2:19 pm Posted by : Mana Praja Prathinidhi

జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల డీఎస్పీ

మన ప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.నవంబర్ 30
గ్రామపంచాయతి ఎన్నికల నేపథ్యంలో తంగాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తూ నమోదు చేసినరిజిస్టర్‌నుపరిశీలించడమే కాకుండా, ప్రత్యక్షంగా పోలీసులు వాహనాలను ఎలా తనిఖీ చేస్తున్నారో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.డీఎస్పీ నాగేంద్రచారి సిబ్బందికి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తూ, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ఉన్నట్లు సమాచారం లభిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.