manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 1:39 pm Editor : Mana Praja Prathinidhi

శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్‌లో వైట్ కోట్ సెరిమనీలో పాల్గొన్న కోలా ఆనంద్

“మానవాళిని కాపాడే శక్తి కలిగిన ఏకైక వృత్తి వైద్య వృత్తే” — కోలా ఆనంద్
మన ప్రజా ప్రతినిధి, రేణిగుంట మండలం.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం జరిగిన వైట్ కోట్ సెరిమనీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ—“మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు వైట్ కోట్ ధరించడం మీ జీవితాల్లోఒక అపూర్వమైన ఆరంభం.వైట్కోట్అనేదివస్త్రంకాదు… నైతికతకు, సేవకు, మానవత్వానికి ప్రతీక. భవనాలు చాలా మంది కడతారు కానీ మానవజాతి భవిష్యత్తును నిర్మించేది వైద్యులే” అని పేర్కొన్నారు.మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులను పేరుపేరునా అభినందిస్తూ, వారి వైద్య ప్రయాణం మానవ సేవతో నిండిపోవాలని ఆశీర్వదించారు.కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, కుర్రకాల్వ వేణు, టౌన్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ గోవర్ధన్, మేకల గురవయ్య, ఐనూరు భాస్కర్, సాయి, చైతన్య, ముని శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.