మల్లికార్జున స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అంగరంగ వైభవంగా..
గజ్వెల్ నియోజకవర్గం. సిద్దిపేట జిల్లా మన ప్రజా ప్రతినిధి// కొండపాక మండలంకొండపాక మండలంలోని మర్పడగ గ్రామంలో ఉన్న శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం గణపతి పూజతోప్రారంభమైనఈవేడుకలురోజంతాభక్తిసాంద్రంగాకొనసాగాయి.క్షేత్ర నిర్వాహకుడు చెప్పాల హరినాధ శర్మ ఆధ్వర్యంలో విజయదుర్గ మాతకు ప్రత్యేక పూజలు, స్వస్తి వాచనం, కళాశాల స్థాపన, నవగ్రహ స్థాపన, స్థాపిత దేవతల పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు పంచామృతం, ఫలరసాలతో విశేష అభిషేకం చేశారు.స్వామివారిని పెట్టు వస్త్రాలతో అలంకరించి, వేదమంత్రాల...