పవన్ పేషీలో సురేష్ లేరు

- వైసీపీ దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు: జనసేన- ఉపముఖ్యమంత్రి కార్యాలయంపై వైసీపీ ప్రచారంపై జనసేన ఆగ్రహం- సురేష్ అనే వ్యక్తి లేరని పార్టీ స్పష్టం- ఆరోపణలు చేసిన వారిపై కేసులు వేసేందుకు సిద్ధమైన న్యాయవిభాగంఅమరావతి, 16  (మనప్రజాప్రతినిధి):ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీపై వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని జనసేన పార్టీ ఖండించింది. పవన్ కార్యాలయంలో సురేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడని, అతను అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఉద్దేశపూర్వకమైన దుష్ప్రచారమేనని పేర్కొంది. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి, పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను...