మనప్రజాప్రతినిధి//తెలంగాణ..
ఉదయం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు టీ తాగుతుంటారు. తెల్లవారు జామునే టీ తాగనిదే కొందరికి ఆ రోజే గడవనట్లే అనిపిస్తుంది అంటుంటారు.అంటే అంత ఇష్టంగా టీ తాగుతారు. అయితే టీలో బిస్కెట్ వేసుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది టీలో బిస్కెట్ వేసుకుని తింటూ ఉంటారు. కానీ టీలో బిస్కెట్ తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీలో బిస్కెట్ వేసుకొని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బిస్కెట్‌లో సోడియం, చక్కెర అధికంగా ఉంటుంది. అందువల్ల టీలో బిస్కెట్స్ తినడం వలన బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి థైరాయిడ్, మధుమేహం వ్యాధి గ్రస్తులు అస్సలే టీతో పాటు బిస్కెట్ తినకూడదంట. అంతే కాకుండా బిస్కెట్స్ రోజూ తినడం వలన జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదంట. ఇది గుండెకు హాని చేయడం, కొలెస్ట్రాలను పెంచుతుంది. అంతే కాకుండా మలబద్ధకం వచ్చే సమస్య ఉంటుంది. అదే విధంగా రోగనిరోధక శక్తి కూడా బలహీనపరుస్తుంది. అందువలన టీతో బిస్కెట్స్ అస్సలు తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
2
పెదాలు నల్లగా మారుతున్నాయా..
చాలామంది యువత ఆరోగ్యం పై, అందంపై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంటారు. అందులో భాగంగానే తమజుట్టుకు, ముఖం అందంగా కనిపించేందుకు ఆముదం రాసుకుంటుంటారు. అంతే కాదు కొంత మంది ఆ నూనెను ఆహారంలో కూడా చేర్చుకుంటారు. ఈ ఆముదంలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఒమేగా 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఇందులో ఉంటాయి. విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఆముదంలో ఉన్నాయి. ఈ నూనెను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నూనెను రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల అలర్జీలు, మొటిమలు, మచ్చలు, మొదలైన సమస్యలు దూరమవుతాయి. మీరు ప్రతిరోజూ మీ పెదవుల పై ఆముదం నూనెను రాసుకుంటే, అది మీ పెదాలను మృదువుగా, గులాబీ రంగులో మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆముదం రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. పెదవుల పిగ్మెంటేషన్ పోతుంది. చనిపోయిన చర్మం క్లియర్ అవుతుంది.పెదవుల పొడిబారితనం పోతుంది.పెదవులు సహజంగా తేమగా, హైడ్రేటెడ్ గా ఉంటాయి.పగిలిన పెదాలను వదిలించుకోవాలి.పెదాల నల్లని సమస్య దూరమవుతుంది.క్రమంగా పెదవులు సహజంగా గులాబీ రంగులోకి మారతాయి. పెదవుల పై ఆముదం ఎలా రాయాలి.. పెదాలను సహజంగా గులాబీ రంగులోకి మార్చడానికి మీరు నేరుగా ఆముదం నూనెను అప్లై చేయవచ్చు. దీని కోసం ఒకటి లేదా రెండు చుక్కల ఆముదం తీసుకుని, దానితో మీ పెదాలను మసాజ్ చేయండి. మీరు దీన్ని ప్రతిరోజూ ఉదయం ఇంటి నుండి బయలుదేరే ముందు, రాత్రి పడుకునే ముందు మీ పెదవుల పై రాయాలి. మీకు కావాలంటే మీరు సహజ పదార్థాల సహాయంతో ఇంట్లోనే కాస్టర్ ఆయిల్ లిప్ బామ్‌ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం, ముందుగా పాన్‌లో షియా బటర్‌ను కరిగించాలి. ఆపై గ్యాస్‌ను ఆపివేయాలి. అది కరిగిన తర్వాత ఒక చెంచా ఆముదం, తేనె, మీకు నచ్చిన ఏదైనా నూనెను జోడిరచండి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ లిప్ బామ్‌ను తప్పనిసరిగా అప్లై చేయాలి. ఇలా చేయడం ద్వారా పెదవులు అందంగా కనిపిస్తాయని చెబుతారు.
3
బెండకాయ వల్ల కలిగే ప్రయోజనాలు
మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు బెండకాయ నువ్వు ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి కూడా ఇష్టపడరు. ఇక బెండకాయతో మనం ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూనే ఉంటాం. ఈ బెండకాయలు మనకు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో విరివిగా లభిస్తూ ఉంటాయి. బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉండటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలతో నిండిఉండే బెండ కాయలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ బెండకాయ వల్ల ఇంకా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు. బెండకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. బెండకాయలో ఉండే గ్లైసెమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయలో ఉండే ప్రొటీన్ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. తగినంత ప్రొటీన్ తీసుకుంటే అది దీర్ఘకాలం మధుమేహ నియంత్రణకు ఉపకరిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బెండకాయ తినడం ద్వారా శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గుతుందట. బెండకాయలోని ఫైబర్, పెక్టిన్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఊబకాయంతో బాధపడే వారు తరుచుగా బెండకాయ తింటే మంచిదట. బెండకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. బెండకాయలో క్యాన్సర్ తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయట. బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గర్భంతో ఉన్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైన అంశం, బెండకాయలలో ఉండే ఫోలేట్ తల్లి, బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పలు అధ్యయనాలు వెల్లడయింది. బెండకాయ తింటే జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. బెండకాయ లోని తేమజిగురు వల్ల కొంచం తిన్న వెంటనే కడుపు నిండుతుందట. బెండకయ మూత్రవిసర్జనకారిగా పనిచేస్తుందట.బెండకాయ ఎక్కువగా తినే వ్యక్తులు హైడ్రేటెడ్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది.
4
తమలపాకు తులసి గింజలను కలిపి తింటే
మామూలుగా చాలామంది ఈ తమలపాకు తినే అలవాటు ఉంటుంది. ఈ తమలపాకుని పాన్ బీడా, పాన్, ఇంకా కొన్ని కొన్ని పదార్థాల ద్వారా తమలపాకులు తీసుకుంటూ ఉంటారు. తమలపాకును తినడానికి ఇష్టపడేవారు తమలపాకు, జర్దా, సున్నం కలిపి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం.అయితే ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్టుగానే తమలపాకు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు లోని ఆస్ట్రింజెంట్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. తమలపాకులు, తులసి గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. తమలపాకులు, తులసి గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అనేక విధాలుగా ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది. తమలపాకులు, తులసి గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక రకాల బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వాతావరణంలో మార్పు కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలలో జలుబు, దగ్గు కూడా ఒకటి. జలుబు అనేది ఒక సాధారణ అనారోగ్య సమస్య. కానీ కరోనా వైరస్ తర్వాత ఈ వ్యాధి సాధారణమైనది కాదు. అటువంటి పరిస్థితిలో తమలపాకులు, తులసి గింజలతో కలిపి తింటే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది జలుబు, దగ్గు సమస్యను దూరం చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దృఢత్వం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ తమలపాకుపాటు తులసి గింజలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. దీంతో పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి గింజలను తమలపాకులతో కలిపి తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులు, తులసి గింజలు కలిపి తీసుకోవటం వల్ల చిగుళ్ల వాపు, దంతాల పసుపు నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చిగుళ్లలో వాపు, గడ్డలు, రక్తస్రావం నుండి ఉపశమనం కలిగిస్తాయి. చాలా సార్లు నోటి నుండి దుర్వాసన సమస్య ఉంటుంది. ఈ దుర్వాసన చాలాసార్లు బ్రష్ చేసినా, కడిగినా పోదు. అయితే తమలపాకులో తులసి గింజలు వేసి క్రమం తప్పకుండా తీసుకుంటే నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
5
తులసి ఆకులని తింటే
న్ని రకాల లాభాలా?
హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.తులసిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సోడియం, ఆస్కార్బిక్ ఆమ్లం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి, గుండెకు బలం, ఎముకలు గట్టితనం, గుండెపోటు రాకుండా గాయాలు మానేందుకు చర్మ సౌందర్యానికి అవయవాల పెరుగుదలకి ,గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయి. అందుకే వైద్యులు తరచుగా తులసి కషాయం తులసి ఆకులను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే మరి పరగడుపున ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే తులసి ఆకులను నమలడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మధుమేహం ఉన్నవారికి కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే వారు ఉదయాన్నే తులసి ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇది డయాబెటిస్ వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇక నోటి దుర్వాసనతో బాధపడేవారు తులసి ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల రోగ నిరోధశక్తి పెరుగుతుంది. దీంతో మీరు అనేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. తులసి ఆకులను నమలడం వల్ల మూత్రపిండాల పనితీరు సైతం మెరుగు పడుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తం శుద్ధి అవుతుంది. ఇది మొటిమలు, మొటిమల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
6
బీరకాయను అవాయిడ్ చేస్తున్నారా..?
మన వంటింట్లో దొరికే కూరగాయలలో బీరకాయ కూడా ఒకటి. ఈ బీరకాయను ఉపయోగించి ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు.. అయితే కొందరు బీరకాయను లొట్టలు వేసుకొని తింటే, మరికొందరు అసలు బీరకాయ తినడానికి ఇష్టపడరు.ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి అత్యధిక నీటిశాతం కలిగిన బీరకాయను ఎండాకాలంలో తింటే చాలా మంచిది. మరి కేవలం ఇవి మాత్రమే కాకుండా ఎండాకాలంలో బీరకాయలు తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బీరకాయ అనేది పోషకాలతో నిండిన కూరగాయ. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు దాగున్నాయి. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. బీరకాయ ముఖ్యంగా తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో పాటు శక్తి వనరు. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, బీరకాయ కూరగాయ బరువు నియంత్రణకు గొప్ప ఎంపికగా పరిగణిస్తారు. బీరకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది తిన్న తర్వాత, సాధారణంగా గ్యాస్ లేదా అజీర్ణం గురించి ఆందోళన ఉండదు. బీరకాయలో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే బీరకాయ పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరకాయ పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ ఉన్నాయి. ఇది పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీరకాయను అవాయిడ్ చేస్తుంటే వెంటనే తినడం మొదలు పెట్టండి.
7
పుచ్చకాయను తెగ తినేస్తున్నారా..
పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా వీటివల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. అయితే పుచ్చకాయలు మనకు ఎక్కువగా వేసవిలో లభిస్తూ ఉంటాయి. అందుకే వేసవి కాలంలో పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. పుచ్చకాయ తినడం వల్ల విటమిన్స్ మినరల్స్ శరీరానికి అందుతాయి. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. అదేవిధంగా చర్మాన్ని పొడిబారకుండా హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది. అయితే వేసవి కాలంలో పుచ్చకాయ తినడం మంచిది అని చాలామంది తెగ తినేస్తూ ఉంటారు. మరి పుచ్చకాయను ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది? వేసవిలో తినడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవి తాపం నుంచి రక్షించే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. చల్లదనంతో పాటు, తాజాగా తినగలిగే పండు ఇది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. వీటి విత్తనాలు కూడా చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. పుచ్చ గింజలు ఐరన్, పొటాషియం, విటమిన్లతో నిండి ఉంటాయి. పుచ్చపండుతో పాటు గింజలను తినడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అతిదాహం, చెమట ద్వారా వచ్చే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడేవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి తక్షణ శక్తి పుంజుకుంటారు. మలబద్ధకం ఉన్నవాళ్లు ప్రతిరోజూ తింటే సమస్య తగ్గుతుంది. పెదవుల్లో తేమ తగ్గకుండా కాపాడుతుంది. ఈ పండులో ఉన్న నీటి శాతం వల్ల మూత్రం సరిగ్గా రానివారు, మూత్ర విసర్జనలో మంట ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.