**రామానగూడ సమీపంలో రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం //మన ప్రజా ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పరిధిలోని రామానగూడ గ్రామం సమీపంలో ఈరోజు మధ్యాహ్నం రాజీవ్ రహదారి పై తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ప్రమాద సమయంలో లారీ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన ప్రభావంతో ఇద్దరూ కేబిన్‌లో ఇరుక్కుపోయారు. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది సహాయంతో వారిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం...