సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినతెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార్ రాజనర్సింహ
మనప్రజాప్రతినిధి//హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార్ రాజనర్సింహ గారు సౌదీ అరేబియాలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు, ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన పలువురు మరణించిన సంగతి పట్ల ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదకర సంఘటన మొత్తం రాష్ట్రానికే భారీ వేదనను కలిగించిందని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం మరియు సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం...