కుప్పంలో ‘1.5 మ్యాటర్స్’ క్లైమేట్ యాక్షన్ ఉద్యమానికి నాంది
యువత కోసం 1M1B గ్రీన్ ఇంటర్న్‌షిప్ ప్రకటించిన భువనేశ్వరిస్థిరమైన అభివృద్ధి, సాంకేతిక నైపుణ్యాలకు ప్రోత్సాహంయువత భవిష్యత్తు నిర్మాణంలో కీలక అవకాశాలుకుప్పం, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన సంస్థ వన్ మిలియన్ వన్ బిలియన్ బృందంతో సంభాషించడం ఆనందమేసిందని నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పంలో ‘1.5 మ్యాటర్స్’ క్లైమేట్ యాక్షన్ ఉద్యమాన్ని ప్రారంభించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమం కుప్పం నుంచి ఆరంభమవడం విశేషమన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నివారణ పై యువతలో అవగాహన పెంచే లక్ష్యంతో...