manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 6:30 am Posted by : Mana Praja Prathinidhi

మహిళల అభివృద్ధికి రాష్ట్రం పెద్దపీట.కాంగ్రెస్ పార్టీ జిల్లా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్ చేతుల మీదుగా చీరల పంపిని..

సిద్దిపేట నియోజకవర్గం.

మన ప్రజా ప్రతినిధి //

మహిళల అభివృద్ధికి రాష్ట్రం పెద్దపీట వేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ ఉన్నతి ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా.రూరల్ పరిధిలో రావురూకుల గ్రామంలో ఇందిరా మహిళ శక్తి చీరలను పంపిణీ చేశారు, సందర్భంగా బండి శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు బస్సు సౌకర్యం 500 కే గ్యాస్ సిలిండర్లు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దుతున్న రేవంత్ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఆని  చెప్పారు. నేను అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందిన్నారు. మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు కల్పించారు ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మహిళను గుర్తించారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  గ్రామ శాఖ అధ్యక్షులు బోడ పరుషయ్య ఇందిరమ్మ కమిటీ సభ్యులు గొట్టం నారాయణ రెడ్డి శీను గొట్టం నారాయణ,రాజు సివో లక్కర్సు లావణ్య సులోచన ఇతర గ్రూప్ లో ఉన్నటువంటి అన్ని సంఘాల మహిళలు సంపూర్ణంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.