రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల గృహాల లక్ష్యం

ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం పేదల గృహ కల నెరవేర్చాలని మంత్రి జూపల్లి స్పష్టంఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు రుణ సాయంపై భరోసాఅదిలాబాద్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): అదిలాబాద్ జిల్లా అనుకుంట కాలనీ బంగారి గూడలో బాస గంగమ్మ–రమేష్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని మంత్రి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇళ్లు పూర్తి చేసుకోలేని లబ్ధిదారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో...