కార్డు అప్పుల నుంచి బయట పడాలంటే ఇవే మార్గాలు
హైదరాబాద్. నవంబర్ 23 మన ప్రజాప్రతినిది// క్రెడిట్ కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ చివరకు బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్న వారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. మొదట్లో చిన్న మొత్తం అనుకుని వాడిన కార్డు ఖర్చు, వడ్డీలతో కలిపి పెద్ద భారం అవుతోంది. కానీ సరైన అవగాహనతో, కొంచెం క్రమశిక్షణతో క్రెడిట్ కార్డును వాడితే అదే మీకు ఆర్థికంగా సహాయపడే సాధనంగా మారుతుంది. అప్పుల ఊబిలో నుంచి బయట పడేందుకు కొన్ని ప్రాథమిక విషయాలను పాటిస్తే చాలు అని ఆర్థిక...