manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 6:11 am Editor : Mana Praja Prathinidhi

తిరుపతి జిల్లాలో 6గురు నేరస్థులపై పిడి యాక్ట్  నమోదు

_ ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు
_నేర చరిత్ర గల గుండా డ్రగ్ లాండ్ మాఫియా ఫోక్ షోకేస్ లో నిందితులపైన పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాం
_నేర చరిత్ర గల వారి పైన పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది

ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా:

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజా శాంతిభద్రతకు, ఆస్తులకు ముప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై ముందస్తు చర్యగా ప్రవెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నేరానికి దారితీసే పరిస్థితులనుముందుగానే అరికట్టే ఉద్దేశ్యంతో, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, అక్రమ రవాణాదారులు,
దోపిడీదారులు, గంజాయి మరియు మాదకద్రవ్య నేరస్థులు, రౌడీలు, అనైతిక రవాణా నేరస్థులు, భూ కబ్జాదారులు లాంటి నేరచరిత్ర గల వ్యక్తులపై  పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగింది.జిల్లాలో నేరస్తులు ప్రజల భద్రతకు, ప్రజల ఆస్తులకు మరియు ప్రజల శాంతికి విఘాతం కలిగించేవారు ఎవరైనా కనిపించినపుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ప్రజల సహకారంతోనే
ప్రమాదకర నేరస్తులను చట్టం ముందుకు తెచ్చి, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వివిధ నేరాలలో పాల్గొన్న 6మంది వ్యక్తులపైతిరుపతి జిల్లా పోలీసులు  పీడీ యాక్ట్ అమలు చెయ్యడం జరిగింది.ముఖ్యంగా డ్రగ్స్, హత్యానేరాలు, దొంగతనాలు, రౌడీయిజం మరియు భూ కబ్జా లాంటినేరాలు పదే పదే చేస్తూ సమాజంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే వారిని గుర్తించి మళ్ళీఆ నేరాలను చేయకుండా నియంత్రించడానికి వారిపై  పిడి యాక్ట్ నమోదు చేయడం జరిగింది.తిరుపతి జిల్లాలో పునరావృత/పదే పదే నేరాలలో పాల్గొంటున్న వారి సమాచారం సేకరించిప్రత్యేక జాబితా తయారు చేయడం జరిగింది.వరుస దొంగతనాలు, ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా వరుసగా నేరాలకుపాల్పడుతున్న నిందితుల కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయాలనే దృఢ సంకల్పంతో చట్ట
పరంగా కఠిన చర్యలలో భాగంగా  పీడీ యాక్ట్ ను అమలు పరచడం జరిగింది.నిందితులు తిరిగి నేరాలకు పాల్పడకుండా ముందస్తుగా చర్య తీసుకోవడమే కాకుండాచట్టాన్ని ఉల్లంఘించాలనే ఆలోచన ఉన్నవారికి ఒక గుణపాఠంగా, చట్టాన్ని ఉల్లఘించే వారిపై
కఠిన చర్యలలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది.డ్రగ్స్, గంజాయి అక్రమ మద్యం విక్రయాలు, భూకబ్జాలు చేసే వారిపై కూడా త్వోరలో పీడీ యాక్ట్.చట్టం క్రింద్ర తీసుకురావడం జరుగుతుంది.తిరుపతి జిల్లాలో లక్షల మంది భక్తులు వచ్చి వెళుతుంటారు, కాబట్టి భక్తుల భద్రత, శాంతి
భద్రతలపై విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలలో భాగమే ఈ చర్య.పోక్సో మైనర్ బాలికలపై అఘాయిత్యాల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి వారిపై రౌడీ షీట్స్ఓపెన్ చేయడమే కాకుండా పదే పదే ఇటువంటి నేరాలకు పాల్పడితే వారిపై కూడా  పీడీ యాక్ట్
నమోదు చేయడానికి సమాచారం సేకరించడం జరుగుతుంది.
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజల భద్రత శాంతి కాపాడుకోవడానికి తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తానన్నారు, పోలీసులందరూ తమ పరిధిలో నేరచరిత్ర గల గుండా డ్రగ్ మొదలగు చర్యలపై గట్టి పర్యవేక్షణ కొనసాగించి వారి సమాచారం సేకరించి ప్రత్యేక జాబితా తయారు చేయాలని ఆదేశించారు అంతేకాకుండా పోలీస్ అధికారులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే ఏదైనా కార్యక్రమాలను గుర్తించి ఎప్పటికప్పుడు సమీప పోలీస్ స్టేషన్ కి లేదా కంట్రోల్ రూమ్ 112 కి సమాచార అందించాలి వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.