manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 2:34 pm Editor : Mana Praja Prathinidhi

వైద్యులను సన్మానించిన గొడుగు తిరుపతి

మన ప్రజాప్రతినిధి / మనకొండూరు, నవంబర్ 27
ఇల్లంతకుంట మండల కేంద్రంలో డాక్టర్ జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన పిల్లల–దంత హాస్పిటల్ ప్రారంభోత్సవం సందడి వాతావరణంలో జరిగింది. గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో విధుల్లో చేరిన పిల్లల వైద్యుడు డాక్టర్ వీరేశ్, దంత వైద్యురాలు డాక్టర్ స్నేహలను ఇల్లంతకుంట పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి ప్రత్యేకంగా కలిసి సన్మానించారు.గ్రామ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో పనిచేసే వైద్యులను ఆదరించడం సమాజ అభివృద్ధికి అవసరమని తిరుపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన వైద్యసేవలు అందడం అత్యంత ముఖ్యమని, కొత్తగా వచ్చిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటే ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.డాక్టర్ వీరేశ్, డాక్టర్ స్నేహలను శాలువాలతో సన్మానిస్తూ “ఇల్లంతకుంట మండల ప్రజలకు మీ సేవలు ఎంతో అవసరం. మీ రాకతో గ్రామానికి నాణ్యమైన వైద్యసేవలు చేరువ అవుతాయి” అని గొడుగు తిరుపతి తెలిపారు.కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, స్థానిక గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా వైద్యుల రాకపై సంతోషం వ్యక్తం చేస్తూ, త్వరలోనే మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయనే నమ్మకం వ్యక్తం చేశారు.