పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం యాక్సిడెంట్లు జరిగే అవకాశం కలదు

_పరిమితవేగంతో ప్రాణాలకు రక్షణ: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్ మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి,నవంబర్ 18, ఈ సందర్భంగా ఎస్పీ  ఒక ప్రకటనలో మాట్లాడుతూ…శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్ముకొని రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడుతాయని, ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా మారి, ఉదయం 8.00 గంటల వరకూ రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ఈ సమయాల్లో ప్రయాణం ప్రమాదకరంగా...