మన ప్రజాప్రతినిధి / మనకొండూరు, నవంబర్ 27
బీజేపీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన సేవలు, సమానత్వం–విద్య కోసం చేసిన పోరాటాన్ని స్మరించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం, మాజీ మండల అధ్యక్షులు నాగ సముద్రాల సంతోష్, జిల్లా నాయకులు మామిడి హరీష్, మండల నాయకులు కాట్నపెళ్లి రవీందర్ రెడ్డి, పినికాశి అనిల్, బూత్ అధ్యక్షులు పిల్లి గోపాల్, గడ్డం కొండల్ రెడ్డి, కార్యకర్తలు పిల్లి బాలయ్య, అంతగిరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ పూలే ఆలోచనలు నేటికీ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.