అండర్–19 రాష్ట్ర హాకీ చాంపియన్‌షిప్ ప్రారంభం
ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులుక్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వ కట్టుబాటుమంత్రి అనిత వంగలపూడి నక్కపల్లి, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):69వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లా స్కూల్ గేమ్స్‌లో భాగంగా నక్కపల్లిలో అండర్–19 బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను మంత్రి అనిత ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనడం వల్ల నక్కపల్లి క్రీడామైదానం క్రీడాస్ఫూర్తితో సందడిగా మారింది. కార్యక్రమం ప్రారంభానికి ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు ఘటించారు. భారత క్రీడల చరిత్రలో ఆయన చేసిన సేవలను...