మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల నవంబర్,17
ఈ రోజు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ టీం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వేములవాడలో పర్యటించారు.పర్యవేక్షణ బృందంలో శ్రీమతి రాధిక మరియు శ్రీకాంత్ లు ఉన్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు,పరికరాలు మరియు పరిశుభ్రత తో పాటు డాక్టర్ల అందుబాటు తదితర వివరాలను సూపరిండెంట్ డా. పెంచలయ్య తో కలిసి ఆసుపత్రి మొత్తం కలియదిరిగి తెలుసుకున్నారు.అందుతున్న సేవలు పరిశుభ్రతను ప్రశంసించారు.ఇందులో వీరితో పాటు డాక్టర్లు సుభాషిణి, తిరుపతి, రవీందర్ మరియు ప్రణతిలు ఇతర నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.