మనప్రజాప్రాతినిధి//కొండపాక మండలం. నవంబర్ 30
నవంబర్ 29 చరిత్రాత్మక రోజు దీక్ష దివాస్ విజయవంతం.అమరవీరులకుటుంబాలకు సన్మానం
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.
కెసిఆర్ దీక్ష ఫలితం అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సహకారమైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి సిద్దిపేట జిల్లా అయింది. సిద్దిపేటకు గోదావరి జిల్లాలు వచ్చాయి, సిద్దిపేటకు రైలు వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ ఎదిగింది అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. బిఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన సిద్దిపేటలోని బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్ సన్మాహాక సమావేశంలో కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ముగ్గురు ఉద్యమ నాయకులు తెలంగాణ రావాలి ఇంకా వస్తుందో రాదో అనే ఆ వేదం చెంది చనిపోయారు. కావునూరి సత్తయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోయారు. కెసిఆర్ గారి ప్రభుత్వం వచ్చాక వారి కుమారుడు సందీప్ కు విద్యా శాఖలో ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ చనిపోగా అతని తమ్ముడు శ్రీధర్ కు వేటర్నరీ శాఖలో ఉద్యోగం కల్పించడం జరిగిందని, కన్నబోయిన ఐలయ్య ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడుతూ ఇంకా తెలంగాణ రాదు ఈ కాంగ్రెస్ ఇవ్వదు అనే ఆవేదనతో చనిపోగా వారి కుటుంబంలో వారి కుమారునికి ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం దీక్ష దివాస్ సందర్భంగా వారి త్యాగాలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులను శాలువలు కప్పి గౌరవించి సన్మానించారు.ఈకార్యక్రమంలో అనంతుల ప్రశాంత్, నూనె కుమార్ యాదవ్, రాగల దుర్గయ్య దోమల ఎల్లం, గోనె శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.