manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 11:26 am Posted by : Mana Praja Prathinidhi

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి నవంబర్ 20:

అనుమాస్పద స్థితిలో మహిళా మృతి, గరిడేపల్లి SI నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గానుగబండ గ్రామానికి చెందిన షేక్ సైదా బీ (45) కు ఇద్దరు కుమార్తెలు, అందరికి వివాహాలు చేసి గ్రామంలోనే భర్త తో కలిసి  కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంది.తేదీ 19.11.25 రోజున రాత్రి 8 గంటల సమయంలో చక్క భజన కు వెళ్ళి, ఆ తరువాత ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళిందని, అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో మృతురాలు తన గ్రామానికి చెందిన పోకల వెంకటేశ్వర్లు దొడ్డిలో  అనుమాస్పదంగా మరణించి ఉండగా, పోకల ఆంజనేయులు పశువులకు గడ్డి వేయుటకు వెళ్లి మృతురాలి శవాన్ని చూసి బంధువులకు తెలిపినాడు, మృతురాలి మరణం పై అదే గ్రామానికి చెందిన పాలెల్లి ఉసేన్ తండ్రి లక్ష్మయ్య పై అనుమానం కలదని భర్త షేక్ సైదా హుస్సేన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపినారు.