manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 1:59 pm Editor : Mana Praja Prathinidhi

కల్లూరు ఏసిపిగా యువ మహిళా అధికారి వసుంధర యాదవ్ బాధ్యతలు

మనప్రజాప్రతినిధి న్యూస్,నవంబర్ 22:

సత్తుపల్లి,

శనివారం కల్లూరు పోలీస్ ఏసీపీ గా యువ మహిళా పోలీస్ అధికారి వసుంధర యాదవ్(ఐపిఎస్) బాధ్యతలు చేపట్టారు.ఆమెకు సత్తుపల్లి పట్టణ పోలీస్ సీఐ టి.శ్రీహరి పూలమొక్క ఇచ్చి స్వాగతం పలికారు.ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని వసుంధర యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గతంలో పని చేసిన అధికారి ఏసిపి రఘు పాల్గొన్నారు.స్థానిక పరిస్థితులను నూతనంగా బాధ్యతలు చేపట్టిన వసుంధర యాదవ్ కు తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.