చీకటిలో వాయులింగుని దర్శనం… కన్నీటితో కైలాసగిరి గిరి ప్రదక్షిణ – భక్తుల వేదన

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్21“వాయులింగేశ్వరుడు కొలువున్న క్షేత్రం మహిమ అపారమైనది… కానీ ఆ మహిమను అనుభవించేందుకు వచ్చే భక్తుల కష్టాలను పట్టించుకునే వారు లేరా?” అని శ్రీకాళహస్తి కైలాసగిరి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.22 కిలోమీటర్ల మేర విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణి గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు స్వయంగా గిరి ప్రదక్షిణ చేసి ఈ క్షేత్ర మహిమను వివరించినా, భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని...