•సంఘ బలోపేతమే లక్ష్యంగా ముందడుగు
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,డిసెంబర్25
రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక వెలమ సంక్షేమ మండలి నూతన కార్యవర్గాన్ని 2026–2028 కాలపరిమితికి గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికల ప్రక్రియసజావుగాజరిగింది.ఈ ఎన్నికల్లోఅధ్యక్షులుగా శ్రీ చెన్నమనేని కమలాకర్ రావు,ప్రధాన కార్యదర్శిగా శ్రీ సురభి సరిన్ గాంధీ రావు,ఉపాధ్యక్షులుగా శ్రీ మేషినేని శ్రీనివాస్ రావు, శ్రీ రోకండ్ల వేంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి నాయినీ మంగ,కోశాధికారిగా శ్రీ బొమ్మెన భాస్కర్ రావు,ప్రచార కార్యదర్శిగా శ్రీ కలకుంట్ల నాగేశ్వర్ రావు,సంయుక్త కార్యదర్శులుగా శ్రీ బొంపెల్లి రవీందర్ రావు, శ్రీ వెన్నమనేని వంశీకృష్ణ రావు, శ్రీమతి బొంత రజిత.
కార్యవర్గ సభ్యులు
శ్రీ గన్నమనేని రంజిత్ రావు
శ్రీ జువ్వాడి ప్రశాంత్ రావు
శ్రీ ద్యావనపెల్లి రామా రావు
శ్రీ నాయిని జగన్మోహన్ రావు
శ్రీ పురం విష్ణుప్రసాద్ రావు శ్రీ బొమ్మవరం వెంకట్రావు
శ్రీ మేనేని హరీష్ రావు
శ్రీ వెన్నమనేని పార్థివ రావు
శ్రీమతి కలకుంట్ల మమత
శ్రీమతి బోయినిపల్లి లతను ఎన్నుకున్నారు..జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మనాయక వెలమ సంఘం ప్రముఖులు, సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలక వర్గానికి మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సభ్యులు మాట్లాడుతూ, తమపై సభ్యులు ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తూ సంఘం అభివృద్ధి, ఐక్యత, సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు.