పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు తప్పనిసరి : జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం
మనప్రజాప్రతినిధి,మెదక్ జిల్లా.చేగుంట,డిసెంబర్10ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రతి పెట్రోల్ బంకులో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం బంక్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్‌పై ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీ సమయంలో ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, తాగునీరు, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్, టైర్లకు ఉచిత గాలి వంటి కనీస సదుపా యాల స్థితిని పరిశీలించారు. ఈ తనిఖీలో ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ పరీక్షలో అనుమానాస్పద...