manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 11:32 am Editor : Mana Praja Prathinidhi

వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.ఏఎంవీఐ రజనీదేవి

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 03
వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఏఎంవీఐ రజనీదేవి సూచించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలోబుధవారం వాహనాల తనిఖీలునిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూవాహనాలకు చెల్లుబాటు అయ్యేభీమా(ఇన్సూరెన్స్) తప్పనిసరిఅని, అగ్రికల్చర్  పేరుతోఉన్న ట్రాక్టర్లనురవాణాకోసంవినియోగించరాదనిస్పష్టంచేశారు.       ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాహనాలపై సరైన నంబర్ ప్లేట్లు ఉండాలనిసూచించారు.అదేవిధంగా ఆటోలలోపరిమితికి మించిప్రయాణికులనుతీసుకురావొద్దని హెచ్చరించారు. సరైనపత్రాలులేనివాహనాలను సీజ్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.తనిఖీల్లో 10 వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కుతరలించినట్లుతెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.