గర్భిణీకి ఇంట్లోనే విజయవంతంగా పురుడు పోసిన 108 సిబ్బందిపండంటి ఆడబిడ్డకు జన్మ-తల్లి, బిడ్డ క్షేమం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్29కొండపాక మండలంలో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తత, నైపుణ్యం వల్ల గర్భిణీకి సురక్షితంగా పురుడు పోసి పండంటి ఆడబిడ్డను ఈ లోకానికి ఆహ్వానించిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది.కొండపాక గ్రామానికి చెందిన లక్ష్మి అనే గర్భిణీకి అకస్మాత్తుగా తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే (108)కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 మెడికల్ టెక్నీషియన్ మహేందర్ అంబులెన్స్‌తో గ్రామానికి చేరుకున్నారు.ఈ సమయంలో లక్ష్మికి నొప్పులు తీవ్రతరంగా మారడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోయింది....