manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 5:38 am Editor : Mana Praja Prathinidhi

ఇచ్చిన మాట మెదక్నిలబెట్టుకున్న కుటుంబం… గ్రామాన్ని కదిలించిన సర్పంచ్ విజయం

మెదక్ జిల్లా.రామాయంపేటమండలం-ఝాన్సీ లింగాపూర్ (మనప్రజాప్రతినిధి)డిసెంబర్21
గ్రామ రాజకీయాల్లో మాటకు విలువ తగ్గుతున్న ఈ రోజుల్లో, ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఒక కుటుంబం ఇచ్చిన మాటను ప్రాణంగా నిలబెట్టుకుని అరుదైన ఉదాహరణగా నిలిచింది.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మానేగల రామకిష్టయ్య సర్పంచిగా విజయం సాధిస్తే తాను బిక్షాటన చేస్తానని ఆయన కుమారుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడు. తండ్రి ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించడంతో, ఆ మాటను నిలబెట్టుకునేందుకు కుటుంబం వెనుకడుగు వేయలేదు.ఇచ్చిన హామీకి కట్టుబడి, మానేగల రామకిష్టయ్య మూడో కుమారుడు భాస్కర్ నేడు గ్రామంలో బిక్షాటన చేస్తూ తన మాటకు విలువ చూపించాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర చర్చకు దారితీసింది.ఇచ్చిన మాటకు కట్టుబడటం అంటే ఏమిటో ఈ కుటుంబం చేతల ద్వారా చూపిందని గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో నైతిక విలువలు ఇంకా బ్రతికే ఉన్నాయనడానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.