manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 12:45 pm Editor : Mana Praja Prathinidhi

ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. రవీంద్రనాథ్‌కు ఘనమైన ఉద్యోగ విరమణ సన్మాన సభ

సదాశివపేట,డిసెంబర్29(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల (GNHS) ప్రధానోపాధ్యాయులుగా దీర్ఘకాలంగా సేవలందించిన శ్రీ ఆర్. రవీంద్రనాథ్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనమైన సన్మాన సభను సోమవారం బసవ సేవాసదన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ ఎస్. రవికుమార్ అధ్యక్షతన అత్యంత వైభవంగా జరిగింది.ఈ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా ఎంఎల్ఏ కుమారుడు చింత సాయి, సదాశివపేట ఎంఈఓ శ్రీ శంకర్ సార్, కాంప్లెక్స్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి జి. జయసుధ, టీజీహెచ్ఎంఏ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి శ్రీ బి. తుకారాం, జిల్లా అధ్యక్షులు శ్రీ ఎల్. సంజీవరావు, ఎంఎన్ఓ శ్రీ పి. సుధాకర్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకుల మానయ్య, జిటిఏ జిల్లా అధ్యక్షులు శ్రీ టి. అనంతరాం, టిటియూ జిల్లా అధ్యక్షులు శ్రీ పి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అలాగే వివిధ ఉద్యోగ సంఘాల మండల, జిల్లా నాయకులు, పలు పాఠశాలల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, సదాశివపేటకు చెందిన ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, శ్రీ ఆర్. రవీంద్రనాథ్ గారు ఉపాధ్యాయ వృత్తికి అంకితభావంతో సేవలందించారని, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఆయన పాత్ర అనన్యసాధ్యమని ప్రశంసించా రు.ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.సన్మాన కార్యక్రమంలో పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలతో శ్రీ రవీంద్రనాథ్ గారిని ఘనంగా సత్కరించగా, ఆయన మాట్లాడుతూ తన సేవాకాలంలో సహకరించిన సహచరులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.