ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. రవీంద్రనాథ్‌కు ఘనమైన ఉద్యోగ విరమణ సన్మాన సభ

సదాశివపేట,డిసెంబర్29(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల (GNHS) ప్రధానోపాధ్యాయులుగా దీర్ఘకాలంగా సేవలందించిన శ్రీ ఆర్. రవీంద్రనాథ్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనమైన సన్మాన సభను సోమవారం బసవ సేవాసదన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ ఎస్. రవికుమార్ అధ్యక్షతన అత్యంత వైభవంగా జరిగింది.ఈ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా ఎంఎల్ఏ కుమారుడు చింత సాయి, సదాశివపేట ఎంఈఓ శ్రీ శంకర్ సార్, కాంప్లెక్స్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి జి. జయసుధ, టీజీహెచ్ఎంఏ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి శ్రీ బి. తుకారాం, జిల్లా...