manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 5:23 am Posted by : Mana Praja Prathinidhi

సర్పంచ్‌లకు ఘన సన్మానం… గ్రామాభివృద్ధికి అంకిత భావం-మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్21
మూడవ విడత సర్పంచ్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం, వెలికట్ట గ్రామ సర్పంచ్ బూరుగుల సురేందర్ రావులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ… గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు.మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల విశ్వాసంతో గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుంద న్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.