manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 11:13 am Editor : Mana Praja Prathinidhi

అంకిరెడ్డిపల్లిలో నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం.

గ్రామఅభివృద్ధికిసమర్థనాయకత్వంఅవసరం-BJYM అధ్యక్షుడు తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్24
అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గాలి బాలయ్యను భారతీయ జనతా యువమోర్చా (BJYM) అధ్యక్షుడు తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో వచ్చిన ఈ బాధ్యతను నూతన సర్పంచ్ సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం అత్యంత అవసరమని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలు చూపే విధంగా సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
గ్రామ ఐక్యతను కాపాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. నూతన సర్పంచ్ నాయకత్వంలో అంకిరెడ్డిపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సింగారం దయాకర్, బూర్గు మహేందర్, తాళ్లపల్లి రాజశేఖర్, రమేష్, రాకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.