manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 1:42 am Editor : Mana Praja Prathinidhi

తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం: చిరంజీవి ఆత్మీయ ఆహ్వానం ప్రత్యేక ఆకర్షణ

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్29
వైకుంఠ ఏకాదశి పవిత్ర సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డిని తిరుపతి విమానాశ్రయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరంజీవి ఘనంగా, అత్యంత ఆత్మీయంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ముందుకు వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసిన చిరంజీవి, సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆయనతో కాసేపు ముచ్చటించారు. చిరంజీవి చూపిన ఆత్మీయత, రాజకీయ పరిపక్వత ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర దినాన ముఖ్యమంత్రి తిరుమల విచ్చేయడం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ప్రతీకగా భావించబడుతుండ గా, ఆ పర్యటనకు తొలి స్వాగతం పలికిన వ్యక్తిగా చిరంజీవి ముందుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రితో చిరంజీవికి ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ సందర్భంగా స్పష్టంగా కనిపించా యి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా, ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేందుకు జిల్లా అధికారులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.మొత్తంగా, ఈ స్వాగత కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిరంజీవి కీలక పాత్ర పోషించడంతో కార్యక్రమా నికి ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.