తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం: చిరంజీవి ఆత్మీయ ఆహ్వానం ప్రత్యేక ఆకర్షణ
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్29వైకుంఠ ఏకాదశి పవిత్ర సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డిని తిరుపతి విమానాశ్రయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరంజీవి ఘనంగా, అత్యంత ఆత్మీయంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ముందుకు వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసిన చిరంజీవి, సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆయనతో కాసేపు ముచ్చటించారు. చిరంజీవి చూపిన ఆత్మీయత, రాజకీయ పరిపక్వత ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర దినాన ముఖ్యమంత్రి తిరుమల విచ్చేయడం రాష్ట్ర...