హెల్మెట్ జీవరక్షకమే… అలక్ష్యం అయితే ప్రాణపాయమే!

తిరుపతి జిల్లాలో పోలీసుల భారీ అవగాహన డ్రైవ్మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా,డిసెంబర్8రోడ్లపై చిన్న తప్పిదమే పెద్ద విషాదాలకు దారి తీస్తున్న తరుణంలో, తిరుపతి జిల్లా పోలీసులు హెల్మెట్ వినియోగంపై విస్తృతమైన చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ఎస్పీ లక్ష్మీ సుబ్బరాయుడు, ఐపీఎస్ ప్రత్యేకఆదేశాలతో ఈ కార్యక్రమాలు గ్రామాలు పట్టణా లన్నింటిలోను వేగంగా కొనసాగుతున్నాయి.ఇటీవల ద్విచక్ర వాహనాల ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో, ప్రాణనష్టం నివారణకు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరిస్తూ అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ వింగ్, బీట్...