ప్రాణ రక్షణకు హెల్మెట్ కవచం-ఏర్పేడులో పోలీసుల కఠిన హెచ్చరిక

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్18రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వాహనదారుడికి హెల్మెట్ ఒక సంజీవని వంటిదని ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఏర్పేడు పట్టణంలో విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి, ప్రమాదాల తీవ్రత, ప్రాణనష్టం గురించి వివరంగా అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూహెల్మెట్ ధరించకపోవడం చిన్న నిర్లక్ష్యంలాఅనిపించినా, ప్రమాదం జరిగితే...