ఈ నెల 6న దళితబహుజనప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మారక సభ
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబరు 01ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సామాజిక ఉద్యమకారుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా కో–కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాట్లాడుతూ—భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన స్మారక సభను దళిత–బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.డా. అంబేద్కర్ దళిత–బహుజన అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆ మహనీయుడి ఆశయాలను ప్రజల్లో మరింత విస్తరించేందుకు ఈ స్మారక సభ నిర్వహిస్తున్నామని రాకేష్ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు, మేధావులు...